Snack's 1967
Teluguworld.wap.sh






 2013 Songs


విడుదల తేదీ : 07 ఫిబ్రవరి 2014
TeluguWorld.wap.sh : 2.75/5
దర్శకుడు : కృష్ణవంశీ
నిర్మాత : రమేష్ పుప్పల
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : నాని, కాథరిన్ త్రిస

యంగ్ హీరో నాని మరియు కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమా ‘పైసా’. చాలా రోజులుగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఫిబ్రవరి 7న ఎట్టకేలకు విడుదలైంది. రమేష్ పుప్పాల నిర్మించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు. కేథరిన్, సిద్దిక శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం .

కథ :
ప్రకాష్ (నాని) ఓల్డ్ సిటీలోని ఒక శర్వాణి మోడల్ గా పనిచే​స్తూ వుంటాడు. అత​ను​ బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఉంటాడు. అతను ప్రక్కనే ఉంటున్న ఒక ముస్లిం అమ్మాయి నూర్ (కేథరిన్)ని ఇష్టపడతాడు. ఒక రోజు ప్రకాష్ వద్దకు ఒక అందమైన, ధనవంతురాలైన అమ్మాయి స్వీటీ(సిద్దిక శర్మ) వస్తుంది. వారిద్దరి మధ్య మంచి స్నేహితులవుతారు. ​ఒకరోజు ​

ప్రకాష్ కు స్వీటీ పవర్ ఫుల్ మినిస్టర్ (చరణ్ రాజ్) కూతురని తెలుస్తుంది. దానితో ఆమెతో ఇంకా కొల్జ్ అయ్యి తన ద్వారా ధనవంతుడు కావాలని అనుకుంటాడు.

ఇదిలా ఉంటే నూర్ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల్లో వుంటుంది. దానితో ఆమెకు ఇష్టం లేకపోయినా తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఓల్డ్ దుబాయ్ షేక్ ని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఈ విషయం ప్రకాష్ కు తెలుస్తుంది. అప్పుడే ప్రకాష్ నూర్ ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నానని తెలుస్తుంది. వెంటనే పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి వచ్చి అక్కడ నుండి నూర్ ను తీసుకొని ఒక బ్లాకు ఇన్నోవా కారులో పారిపోతాడు.

ఆ ఒక్క ఇన్సిడెంట్ తో అతని జాతకమే మారిపోతుంది. ఈ బ్లాక్ ఇన్నోవాలోని ట్రక్ లో దోచుకోబడిన రూ. 50 కోట్లు వుంటాయి. అది మినిస్టర్ చరణ్ రాజ్ యొక్క హవాల సొమ్ము. ఆ తరువాత జరిగిన పరిణామాల వల్ల నానికి అది తెలుస్తుంది. ఈ రూ.50 కోట్ల కోసం నాని​,​చరణ్ రాజ్ గ్యాంగ్ కు మధ్య అలాగే మరికొంత మందితో బారీ ఫైట్ జరుగుతుంది. మరి ఆ డబ్బు బ్యాగ్ ఎవరి సొంతం అవుతుంది? నూర్, స్వీటీలలో ప్రకాష్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ముఖ్యంగా ‘పైసా’ సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
ప్రకాష్ పాత్రలో నాని చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. అతను ఓల్డ్ సిటీ యువకులు ఎలా ఉంటారో అనేదాని పరిశీలించి చేయడం వల్ల రఫ్ లుక్ లో ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయగలిగాడు. అతనికి కార్ లో రూ. 50 కోట్లు దొరకినప్పుడు పెర్ఫార్మన్స్ చాలా బాగా చేసాడు.

కేథరిన్ చూడటానికి అందంగా వుంది. సిద్దిక శర్మ గ్లామర్ తో ఆకట్టుకుంది.​ ఈ సినిమాలో కొని సన్నివేశాలు చాలా బాగున్నాయి, ఉదాహరణకి ఇంటర్వల్ బ్లాక్ మరియు సెకండాఫ్ లో హవాలా డబ్బు మిస్ అయినప్పుడు దానికోసం ప్రజలు వెతికే కొన్ని సన్నివేశాలు. అలాగే కొన్ని పాటలలో షూట్ చేసిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్ :
కొన్ని టాప్ సన్నివేశాలు టిపికల్ కృష్ణవంశీ స్టైల్లో వున్నాయి. దర్శకత్వం చెప్పుకోదగిన స్థాయిలో లేదు మరియు స్కీన్ ప్లే సినిమాకి చాలా చోట్ల మైనస్ అని చెప్పాలి. సినిమాలో కొన్ని లూప్ హోల్స్, అలాగే సరైన జస్టిఫికేషన్ లేని సీన్స్ కథలో చాలా వున్నాయి. ఈ సినిమాలో కృష్ణ వంశీ సినిమాలో

​ఉండేటువంటి​ గొప్ప సాంకేతిక విలువలు కనిపించవు.బ్యాక్ గ్రౌండ్లో విసువల్ ఎఫెక్ట్స్ ​తో చేసిన​ చార్మినార్ అది నిజం కాదన్నట్టుగా ఉంటుంది.

కెమెరాని అవసరంలేకున్నా​ ​క్లిష్టమైన యాంగిల్స్ లో పెట్టి, ఎఫెక్ట్స్ లో షూట్ చేయడం జరిగింది. అవి కాస్త చిరాకు పుట్టిస్తాయి. కృష్ణ వంశీ తను అనుకున్నది ప్రూవ్ చేయడనికి చాలా ట్రై చేశాడు. కానీ అది జరగలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సన్నివేశాలు ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారు. కృష్ణవంశీ ఫ్రీ క్లైమాక్స్ ని చెడగొట్టారని చెప్పాలి. చరణ్ రాజ్ పాత్ర చాలా చిరాకుగా అనిపిస్తుంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువగా ఉంది.

సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ చాలా వీక్ గా ఉంది. ఎడిటింగ్ అంత బాగోలేదు.

సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక సీన్ నుండి ఇంకో సీన్ కి జంప్ అయిపోతూ ఉంటాయి. చెప్పుకోదగ్గ రేంజ్ లో డైలాగులు కూడా లేవు. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఒకే. కృష్ణవంశీ కాస్త హై రేంజ్ ఎమోషనల్ సన్నివేశాలు, అలాగే టాప్ లెవల్ నుంచి షాట్స్ తీయడం లాంటివి తీయడం తగ్గించుకోవాలి ఎందుకంటే వాటికి ఆడియన్స్ పెడగా కనెక్ట్ అవ్వడం లేదు.

తీర్పు :

సినిమాతో కొత్త ప్రయోగం చేసినప్పటికీ అది బాక్స్ ఆఫీసు వద్ద ఆశించినంత వసూలను అందించకపోవచ్చు. పూర్ టెక్నికల్ వ్యాల్యూస్, ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే, తక్కువ ఎంటర్టైనింగ్ వాల్యుస్ ఉన్న ఈ సినిమా చూసేవారిని నిరాశపరుస్తుంది.





TeluguWorld.wap.sh:-2.75/5




Users Online


2136